జీవో ప్రకారం వేతనాలివ్వాలి

07-10-2026 | 11:49am

ఆసిఫాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న సుమారు 40 మంది సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం నెలకు రూ.15,600 వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అతనికి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ఏడాది కాలంగా కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను కూడా జమ చేయలేదన్నారు. అధికారుల(Officials) వెంటనే స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు కార్మికులకు బకాయి వేతనాలు, పీఎఫ్(PF), ఈఎస్ఐ(ESI) చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని రాజేందర్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు