పత్తి పంట క్షేత్ర సందర్శన

07-10-2026 | 12:28pm

లక్షెట్టిపేట రూరల్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో బుధ వారం ఎల్ఎస్ఆర్ సీడ్స్(LSR Seeds) ఆధ్వర్యంలో ఎస్బి "ఫిదా" బీజీ 2 పత్తి పంట(Fidaa BG2 cotton crop)ను చుట్టు పక్కల ఆరు గ్రామాల రైతులు(Farmers ) సందర్శించారు. తిప్పని తిరుపతి పత్తి పంటను సుమారు 153 మంది రైతులు వీక్షించారు. కంపెనీ ప్రతినిధి, RSM నాంపల్లి తిరుపతి రైతులనుద్దేశించి మాట్లాడారు. 

ఇవి కూడా చదవండి: కూలీల వలసకు చెక్: ఎంపీడీవో

"ఫిదా" బిజీ 2 రకం పత్తి ఎక్కువ కొమ్మలు వచ్చి చాలా బరువైన, పెద్ద కాయలు కాసి రైతులకు దిగుబడిని ఎక్కువగా ఇస్తుందన్నారు. పురుగు, దోమ, పేను బంక తదితర తెగుళ్ళని తట్టుకోగల శక్తి ఉంటుందని వెల్లడించారు. రైతులకు పంట సాగు పై అవగాహన కల్పించారు. ఈ ఫీల్డ్ విసిట్ లో జిల్లా సేల్స్ ఆఫీసర్ సత్యనారాయణ, శ్రీ రామ ఆగ్రో ఏజెన్సీస్ అప్పని ప్రశాంత్, రైతుమిత్ర ఫెర్టిలైజర్స్  మీస శ్రీనివాస్, హనుమాన్ ఫెర్టిలైజర్స్ B. సాయి, వివిధ గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు