ప్రతి కుటుంబానికి రేషన్
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ ద్వారా ఉచిత సన్న బియ్యం
మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి
నేరేడుచర్ల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్నదని,ప్రతి వ్యక్తికీ 6 కేజీలు బియ్యం సరఫరా చేస్తుందని,స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సహకారంతో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు.
నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి అన్నారు.నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 7వ ,8వ వార్డులలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై 07 వార్డు కౌన్సిలర్ వాసా జ్యోతి శేఖర్,08 వార్డు కౌన్సిలర్ తాళ్ళ లావణ్య సురేష్ రెడ్డి తో కలిసి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
ఈ సందర్బంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, కౌన్సిలర్స్ ఇంజమురి శ్రీకాంత్, అబ్దుల్ ఖలీమ్, డీలర్ స్వప్న, మాజీ సర్పంచ్ చింతమల్ల సైదులు, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.