మోదీ నోట కొత్త స్లోగన్

07-10-2026 | 12:30pm

న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (Developed India 2047) తీర్చిదిద్దే లక్ష్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పిలుపునిచ్చారు. దేశం ముందుకు సాగాలంటే స్పష్టమైన విధానాలు, దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు ప్రజల కృషి కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ‘We Will Do It’ అనే కొత్త నినాదాన్ని మోదీ ప్రకటించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రభుత్వాధినేతగా తన 25 ఏళ్ల ప్రజాసేవా( Modi 25 Years Public Service) ప్రస్థానం పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో సమాజాన్ని కులాలు, ఓట్ల ఆధారంగా విడదీయడం కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. ఒక రైతు పొలానికి నీరు అందకపోతే అది ఒక్క కులానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదని, విద్యుత్ లేకపోతే చీకటి ఒక్క వర్గానికే పరిమితం కాదని వివరించారు. సమస్య అందరినీ ప్రభావితం చేస్తే.. దాని పరిష్కారం కూడా అందరికీ ఉపయోగపడేలా ఉండాలని స్పష్టం చేశారు. Viksit Bharat 2047, Developed India 2047, India 2047 Vision, PM Modi 2047 Slogan అంశాలపై మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు