ఫ్యూచర్ సిటీలో బిగ్ ఛేంజ్

07-10-2026 | 07:07am

ఫ్యూచర్ సిటీలో కొత్త పోలీస్ సెటప్.. కొత్త పోలీస్ మ్యాప్ ఇదే!

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ అభివృద్ధి వేగం పెరుగుతున్న వేళ.. అక్కడి పోలీస్ వ్యవస్థలో(Police System) భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్(Future City Police Commissionerate) పరిధిలో పోలీస్ రీ-ఆర్గనైజేషన్ చేపట్టారు. శాంతిభద్రతల నిర్వహణతో పాటు ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థంగా చేపట్టేందుకు కొత్త డివిజన్లు, జోన్లు, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

ఫ్యూచర్ సిటీలో(Future City Traffic Zones) 3 కొత్త శాంతిభద్రతల డివిజన్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఆమనగల్, కొత్తూరు, మొయినాబాద్ డివిజన్లు(Moinabad Division) ఉన్నాయి. అదే సమయంలో ట్రాఫిక్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల ట్రాఫిక్ డివిజన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఫ్యూచర్ సిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసింగ్ మరింత పటిష్టం కానుంది. ఇక ట్రాఫిక్ నిర్వహణ కోసం ఫ్యూచర్ సిటీని ట్రాఫిక్-1, ట్రాఫిక్-2గా రెండు కొత్త ట్రాఫిక్ జోన్లుగా విభజించారు. అలాగే 3 కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పెరుగుతున్న జనాభా, రహదారి రద్దీ, భవిష్యత్‌లో భారీగా పెరగనున్న వాహనాల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌ను(Abdullapurmet Police Station) మహేశ్వరం జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. అజీజ్‌నగర్‌లో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉన్న కొన్ని స్టేషన్ల పేర్లలోనూ మార్పులు చేశారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పేరును పెద్దషాపూర్‌గా, ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పేరును శంషాబాద్‌గా మార్చారు. పెద్దషాపూర్ పోలీస్ స్టేషన్‌ను కొత్తూరు డివిజన్ పరిధిలోకి తీసుకువచ్చారు. అదేవిధంగా గ్రీన్ సిటీ పోలీస్ స్టేషన్‌కు మీరాఖాన్‌పేట్గా పేరు మార్చారు. మొత్తంగా చూస్తే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో కొత్త డివిజన్లు, ట్రాఫిక్ జోన్లు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, పేర్ల మార్పులతో భారీ స్థాయిలో పోలీస్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఫ్యూచర్ సిటీ విస్తరణకు అనుగుణంగా శాంతిభద్రతలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పోలీస్ పర్యవేక్షణ మరింత వేగంగా జరిగేలా ఈ కొత్త వ్యవస్థ కీలకంగా మారనుంది.

మరిన్ని వార్తలు