బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా వెంకటనర్సయ్య..

19-10-2026 | 04:59pm

చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బిజెపి అధికార ప్రతినిధిగా చెన్నూర్ పట్టణానికి చెందిన గర్రెపల్లి వెంకటనర్సయ్య(Garrepally Venkatanarsaiah) నియామకం అయ్యారు. సోమవారం జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెంకటనర్సయ్యకు నియామక పత్రం అందజేశారు. రాజకీయ అనుభవం, విషయ పరిజ్ఞానం ఉన్న వెంకటనర్సయ్యను నియమించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. నాపై నమ్మకంతో అప్పగించిన గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని, పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు