మహిషాసురమర్దినీ దేవి అలంకారంలో పర్వత వర్ధిని అమ్మవారు
19-10-2026 | 04:56pm
యాదగిరిగుట్ట, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవీ నవరాత్రోత్సవాల(Navaratri celebrations) సందర్భంగా సోమవారం మహిషాసురమర్దినీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం పారాయణాలు, శ్రీ దేవీ మూలమంత్రజపములు, సహస్రనామార్చన మధ్యాహ్నం శ్రీ దేవీ చతుషష్టి ఉపచార పూజ నీరాజన మంత్ర పుష్పములు పండితులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.