గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

19-10-2026 | 04:54pm

బేల అక్టోబర్ 19 (విజయక్రాంతి): వి.బి.జి. రాంజీ నిధుల నుంచి రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణం పూర్తయితే గ్రామ పరిపాలనకు, ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు మరింత సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఒళ్ళపవార్ భాగ్యలక్ష్మి దేవన్న, ఉప సర్పంచ్ బేతంవార్ ప్రకాష్, ప్రత్యేక అధికారి ఎం. మనోహర్, ఎంపీడీఓ మహేష్ కుమార్, వార్డ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు