ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలి

17-09-2026 | 04:02pm

చేర్యాల ఇంచార్జి తహసీల్దార్ సందీప్

చేర్యాల,(విజయక్రాంతి): ఎస్ఐఆర్ లో భాగంగా నోటీసులు జారీ అయిన వ్యక్తులకు మున్సిపాలిటీ కార్యాలయంలో విచారణ ప్రక్రియ సెప్టెంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు కొనసాగుతుందని చేర్యాల ఇన్‌ఛార్జి తహసీల్దార్ సందీప్ తెలిపారు. నోటీసులు అందిన వారు నోటీసులో పేర్కొన్న తేదీన చేర్యాల మున్సిపల్(Cheryala Municipality) కార్యాలయానికి స్వయంగా హాజరు కావాలన్నారు.

వారి ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వం సూచించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో సంబంధిత పత్రాలు తీసుకురావాలన్నారు. బ్యాంక్ పాస్ బుక్, పోస్టాఫీస్ పాస్ బుక్, ఆస్తి పన్ను రసీదులు, పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకురావాలని, తల్లిదండ్రుల ఆధారాలు కూడా తీసుకురావాలని సూచించారు.సరైన పత్రాలతో విచారణకు హాజరై ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు