కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది సమ్మె

04-11-2026 | 03:41pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖలో(Department of Medical and Health) ఎన్‌హెచ్‌ఎం విభాగం సిబ్బంది తమ డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న సమ్మె కొనసాగుతోంది.సమ్మెలో పాల్గొంటున్న సిబ్బందికి ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Lakshmi) ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ హైమద్, మండల పార్టీ అధ్యక్షుడు రవి, కౌన్సిలర్ సాలం తదితరులు సమ్మెకు మద్దతు తెలిపి సిబ్బందికి భోజనం వడ్డించారు.

మరిన్ని వార్తలు