విడుదలకు ముందే రికార్డుల వేట
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రామాయణం.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు
విడుదలకు ముందే రికార్డుల వేట.. రూ.100 కోట్లకు చేరువలో రామాయణం!
రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రామాయణం: పార్ట్ వన్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ సృష్టిస్తోంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు స్థాయి స్పందన అందుకుంటోంది. దేశీయంగా టికెట్ల అమ్మకాల ద్వారా రూ.100 కోట్ల Gross మార్కుకు చేరువైంది. నవంబర్ 4 ఉదయం నాటికి ఐదు రోజుల Advance Booking ద్వారా బ్లాక్ చేసిన సీట్లతో కలిపి రూ.96.56 కోట్ల గ్రాస్ నమోదైనట్లు ట్రేడ్ నివేదికలు వెల్లడించాయి. బ్లాక్ సీట్లను మినహాయిస్తే ఈ మొత్తం రూ.77.31 కోట్లుగా ఉంది. నవంబర్ 5 నుంచి 9 వరకు దేశవ్యాప్తంగా సుమారు 83 వేల షోలకు 25.65 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. తొలి రోజు బుకింగ్స్‌లోనే రూ.39.35 కోట్ల గ్రాస్ రావడం విశేషం.
ఈ వసూళ్లలో హిందీ వెర్షన్ వాటా సుమారు 82 శాతంగా ఉంది. తెలుగు, కన్నడ వెర్షన్లకు కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ-ఎన్సీఆర్, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో టికెట్లకు భారీ స్పందన వస్తోంది. 3D, IMAX ఫార్మాట్లలోనూ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. సన్నీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ.100 కోట్ల మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. విడుదలకు ముందే ఈ స్థాయి స్పందన రావడంతో సినిమా Opening Day కలెక్షన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.