జర్నలిస్టులపై వాట్సాప్‌లో దుష్ప్రచారం

04-11-2026 | 02:45pm

రిపోర్టర్ ఫిర్యాదుతో రంగంలోకి రాయదుర్గం పోలీసులు

వసూళ్ల ఆరోపణలపైనా విచారణ జరపాలంటున్న బాధితులు

మణికొండ,(విజయక్రాంతి): మణికొండలో భూవివాదాలు(Land disputes), భూముల చదును వ్యవహారాలపై వార్తలు సేకరిస్తున్న విలేకరుల(Journalists) వ్యక్తిగత ఫొటోలను పలు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న దొడ్డి లక్ష్మణ్‌ అనే వ్యక్తిపై పలువురు విలేకరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల సర్వే నంబర్‌ 186లో భూమిని చదును చేస్తున్న చర్యలను విలేకరులు అడ్డుకున్న నేపథ్యంలో ఆ వ్యక్తి విలేకరులపై దుష్ప్రచారం చేశాడని తెలిసింది.

బాధిత జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police) దొడ్డి లక్ష్మణ్‌ను విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు పిలిచారు. ఇదిలా ఉండగా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో మణికొండలో దుకాణదారులు, రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వారి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బుల్కాపూర్ నాలాపై షెడ్‌ నిర్మాణానికి అనుమతి ఇప్పిస్తానంటూ రూ.లక్ష తీసుకున్నట్లు కూడా సమాచారం. ఈ వసూళ్ల ఆరోపణలపైనా  విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు