తీరానికి చేరని బోటు

04-11-2026 | 11:30am

సముద్రంలో తుఫాను కల్లోలం.. 9 మంది జాలర్లు గల్లంతు!

చెన్నై: సముద్రంలో తుఫాను బీభత్సం సృష్టించింది. చెన్నై తీరంలో Cyclone Murasu ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య చేపల వేటకు వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు గల్లంతవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాశిమేడు Fishing Harbour నుంచి సముద్రంలోకి వెళ్లిన వారి Mechanised Boat‌తో సంబంధాలు తెగిపోవడంతో కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వివరాల ప్రకారం.. స్థానిక మత్స్యకారుడు సెల్వలగన్‌కు చెందిన TN 02 MM 2584 రిజిస్ట్రేషన్ నంబర్ గల బోటులో తొమ్మిది మంది సిబ్బంది అక్టోబర్ 29న Deep Sea Fishing కోసం సముద్రంలోకి వెళ్లారు. నవంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల సమయంలో బోటుతో Communication పూర్తిగా నిలిచిపోయినట్లు తోటి మత్స్యకారుడు సతీష్ కుమార్ వెల్లడించారు.

వాతావరణం(Weather) ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో వెంటనే తీరానికి తిరిగి రావాలని బోటు సిబ్బందికి సమాచారం అందించారు. అయితే భారీ అలలు, బలమైన గాలుల కారణంగా వారు తీరానికి చేరుకోలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో మరో బోటు పక్కన Anchor వేసి నిలిచినట్లు సమాచారం. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడం కలకలం రేపుతోంది. తుఫాను ప్రభావంతో సముద్రంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో తొమ్మిది మంది మత్స్యకారుల ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది. వారి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు