ఎర్రపహాడ్ లో తెరుచుకున్న హోమియోపతి వైద్యశాల..
04-11-2026 | 04:48pm
తాడ్వాయి,నవంబర్,04( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడు గ్రామంలోని హోమియోపతి వైద్యశాల బుధవారం తెరుచుకొని ఉంది.ఈనెల 3న విజయక్రాంతిలో ప్రచురితమైన హోమియోపతి వైద్యశాలకు(Homeopathy Clinic) తాళం అనే కథనానికి అధికారులు స్పందించారు.గత కొన్ని రోజుల నుంచి అప్పుడప్పుడు తాళం వేసి ఉంటున్న వైద్యశాల విజయక్రాంతి కథనంతో తెరుచుకొంది. వైద్యాధికారి సైతం విధులకు హాజరయ్యారు.విజయ క్రాంతి కథనంపై గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.