థియేటర్లలో రోజుకు 6 షోలు

04-11-2026 | 01:38pm

సినిమా రిలీజ్‌కు జోష్.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం!

తమిళ సినీ పరిశ్రమకు సీఎం సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలకు తొలి వారం పాటు రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2:30 గంటల వరకు ఈ Shows నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తొలి వారంలో పెరిగే ప్రేక్షకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు షోలతో Box Office Collections పెరుగుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

కొత్త సినిమాల మొదటి వారంతో పాటు స్థానిక పండుగలు, ప్రభుత్వ సెలవులు, శని, ఆదివారాల్లోనూ రోజుకు ఆరు షోలకు అనుమతి వర్తించనుంది. గతంలో రోజుకు నాలుగు షోలకే పరిమితమైన నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ వచ్చింది. తాజాగా ఐదు షోల నుంచి ఆరుకు పెంచింది. ఈ నిర్ణయంతో కొత్త సినిమాలకు మరిన్ని Screening అవకాశాలు లభించనున్నాయి. థియేటర్ల Occupancy పెరగడంతో పాటు నిర్మాతలు, పంపిణీదారులకు ఆదాయం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. విజయ్ ప్రభుత్వ నిర్ణయంపై కోలీవుడ్‌లో హర్షం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు