కొనసాగుతున్న ఎస్పీఎం కార్మికుల రిలే దీక్షలు
01-10-2026 | 09:44pm
కాగజ్‌నగర్,(విజయక్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల రిలే దీక్షలు(Sirpur Paper Mill Workers Relay Protests) గురువారానికి 135వ రోజుకు చేరుకున్నాయి. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను(Labor union elections) వెంటనే నిర్వహించాలని, పేపర్ మిల్లు పునఃప్రారంభ సమయంలో 2018లో విధుల్లోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేసిన స్థానిక కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మిల్లు గేటు ఎదుట దీక్షలు కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా ఏకే సింగ్, వడ్డేపల్లి రాజు, సురేందర్ యాదవ్ దీక్షలో పాల్గొనగా, జేఏసీ కన్వీనర్ గోగర్ల రాములు వారికి సంఘీభావం తెలిపారు.