ప్లాట్ఫాపాం ఏర్పాటు చేయండి సారు..!
బెజ్జూర్ నవంబర్ 24 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని గోల్కొండ గిరిజన పాఠశాల(Golconda Tribal School) ప్రాంగణంలో చేతిపంపు చుట్టూరా ప్లాట్ ఫారం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ప్రాంగణంలోని చేతిపంపు చుట్టూరా ప్లాట్ ఫారం చెడిపోయి సంవత్సరాలు గడిచిన అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు.
చేతి పంపు చుట్టూరా ప్లాట్ఫారం లేకపోవడంతో విద్యార్థులు బురదలో ఇబ్బందులు పడుతూ త్రాగునీరు, మధ్యాహ్న భోజన సమయంలో ప్లేట్లు కడిగేందుకు ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు. అంతేకాకుండా పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, పైప్ లైన్ లీకేజీ తో ప్రాంగణం బురద మయంగా మారింది.
విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఆటలు ఆడుకునేందుకు సైతం ప్రాంగణం బురదమయంగా, పిచ్చి మొక్కలు, ప్రాంగణం సైతం శుభ్రంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి చేతి పంపు చుట్టూరా ప్లాట్ఫారం ఏర్పాటుచేసి, విద్యార్థులకు పాఠశాల ప్రాంగణంలో ఆటలు ఆడుకునేలా చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.