వాట్సాప్‌లో ఆ మెసేజ్ వస్తే క్లిక్ చేయొద్దు!
దీపావళి గిఫ్ట్ పేరుతో సైబర్ మోసం.. రూ.1,000 ఆఫర్ నమ్మితే ఖాతా ఖాళీ!
హైదరాబాద్: దీపావళి పండగ వేళ సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. Paytm పేరుతో ప్రతి ఒక్కరికీ రూ.1,000 Diwali Gift ఇస్తున్నట్లు వాట్సాప్‌లో నకిలీ మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. ఈ ఆఫర్ నిజమని నమ్మి లింక్ క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు చోరీ అయ్యే ప్రమాదం ఉందని హైదరాబాద్ సీపీ సజ్జనార్(Hyderabad CP Sajjanar) హెచ్చరించారు. 'మొదట నాకూ Fake అనిపించింది.. కానీ నిజంగానే రూ.1,000 వచ్చాయి.. మీరు కూడా ప్రయత్నించండి' అంటూ ఇతరులను నమ్మించేలా మెసేజ్‌లు పంపుతున్నారని తెలిపారు. పండగ సమయంలో ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అప్రమత్తం చేశారు.
ఇలాంటి అనుమానాస్పద లింక్స్‌పై పొరపాటున కూడా క్లిక్ చేయొద్దని సీపీ సూచించారు. తెలియని వెబ్సైట్లలో వివరాలు నమోదు చేస్తే Personal Data, Banking Details చోరీ కావడంతో పాటు బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులు కూడా మాయమయ్యే అవకాశం ఉందన్నారు. గుర్తుతెలియని లింకులను ఓపెన్ చేయకూడదని, నకిలీ ఆఫర్లను ఇతర WhatsApp గ్రూపులకు ఫార్వర్డ్ చేయొద్దని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ Banking Details, UPI PIN, OTPలను ఎవరికీ షేర్ చేయకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ Cyber Crime Helpline నంబర్ 1930కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.