దీపావళికి ముందే ఊపిరాడని పరిస్థితి
ఢిల్లీని కమ్మేసిన కాలుష్య మేఘాలు
న్యూఢిల్లీ, నవంబర్ 7: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం(Delhi Air Quality) మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి పండుగకు ఒక్కరోజు ముందు గాలి నాణ్యత మరింత ఆందోళనకరంగా మారింది. శనివారం ఉదయం 9 గంటలకు Air Quality Index (AQI) ఏకంగా 364కు చేరింది. దీంతో ఢిల్లీ నగరం Very Poor కేటగిరీలో కొనసాగుతోంది. పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్న అంచనాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
శుక్రవారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గిన AQI
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) గణాంకాల ప్రకారం శనివారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలో AQI 364గా నమోదైంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు 24 గంటల సగటు సూచీ 382గా ఉంది. అంటే గత రోజుతో పోలిస్తే కాలుష్య స్థాయిలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ గాలి నాణ్యత మాత్రం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉంది.
దీపావళి తర్వాత మరింత పెరిగే అవకాశం!
దీపావళి సందర్భంగా బాణసంచా వినియోగం పెరిగితే గాలిలోకి భారీగా పొగ, ధూళి కణాలు చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న రాజధాని ప్రజలకు ఇది మరింత సమస్యగా మారవచ్చు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో గాలి నాణ్యతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
AQI స్థాయులు ఎలా ఉంటాయంటే?
CPCB ప్రమాణాల ప్రకారం గాలి నాణ్యతను ఆరు విభాగాలుగా వర్గీకరిస్తారు. 0-50 మధ్య ఉంటే Good, 51-100 ఉంటే Satisfactory, 101-200 మధ్య Moderate, 201-300 మధ్య Poor, 301-400 మధ్య Very Poor, 401-500 మధ్య Severeగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలో 364 AQI నమోదవడంతో అక్కడి గాలి నాణ్యత Very Poor స్థాయిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.