భారత్‌కు బిగ్ షాక్.. డకౌటైన గిల్

07-11-2026 | 12:36pm

డకౌటైన గిల్.. 135 పరుగుల ఛేజ్‌లో భారత్‌కు తొలి షాక్!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో ODIలో 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఛేజింగ్ ప్రారంభించిన భారత్ తొలి వికెట్‌ను కేవలం 4 పరుగుల వద్దే కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డకౌట్‌గా వెనుదిరగడంతో భారత శిబిరంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. కివీస్ నిర్దేశించిన 135 పరుగుల Targetను ఛేదించేందుకు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చారు.

జేమీసన్ తొలి ఓవర్ వేయగా, రెండో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన జాకబ్ డఫీ భారత్‌కు తొలి దెబ్బ కొట్టాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే గిల్ నికోల్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 1.1 ఓవర్లలో భారత్ స్కోరు 4/1గా నమోదైంది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. తక్కువ Target కావడంతో భారత్‌పై పెద్దగా ఒత్తిడి లేకపోయినా, కెప్టెన్ వికెట్ కోల్పోవడం ఆరంభంలోనే ఎదురుదెబ్బగా మారింది. ఈ పరిస్థితుల్లో రోహిత్, కోహ్లీ ఎలా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీమిండియా త్వరగా కోలుకుని లక్ష్యాన్ని చేరుకుంటుందా? అన్నది చూడాలి.

Live Score: భారత్ 14/1 (2.2 ఓవర్లు)

Target: 135 పరుగులు

Out: శుభ్‌మన్ గిల్ 0 (1)

మరిన్ని వార్తలు