ఏడేళ్ల తర్వాత భాగ్యనగరికి మాతా అమృతానందమయి

07-11-2026 | 11:25pm
  1. నవంబర్ 10, 11 తేదీల్లో ఘనంగా ఆధ్యాత్మిక వేడుకలు...
  2.    500 మంది నిరుపేద మహిళలకు చీరలు...
  3.    25 మందికి వీల్చైర్ల పంపిణీ...

సికింద్రాబాద్,నవంబర్7(విజయక్రాంతి): ఏడేళ్ల తర్వాత మాతా అమృతా నందమయి అమ్మవారు(Mother Amritanandamayi) భాగ్యనగరికి విచ్చేస్తుండటంతో భక్తుల్లో(devotees) ఆనందోత్సాహాలు నెలకొన్నాయని, నవంబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్లో నిర్వహించనున్న ఈ వేడుకలకు మాతా అమృతా నందమయి మఠం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశామని స్వామిని సువిద్యామృత ప్రాణ,స్వామి అమృత పుత్రన పురి తెలిపారు. శనివారం మహేంద్ర హిల్స్ లోని మాత అమృతానందమయి మట్ ఆధ్వర్యంలో అమ్మ భారత యాత్రలో భాగంగా బ్రహ్మస్థాన 25వ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా అమ్మ ఆశీస్సులతో నిర్వహిస్తున్న పాఠశాల ప్రారంభమై 27 సంవత్సరాలు పూర్తవడం, బ్రహ్మస్థాన ఆలయంలో శివ కుటుంబ ప్రతిష్ఠ జరిగి 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.అమ్మవారి భారత యాత్రలో భాగంగా కేరళ నుంచి ప్రారంభమైన పర్యటన మైసూరు, బెంగళూరు మీదుగా హైదరాబాద్కు చేరుకోనుంది. అనంతరం పుణె, ముంబై, అహ్మదాబాద్, రాజస్థాన్, ఢిల్లీ, కోల్కతా నగరాల్లో అమ్మవారు పర్యటించనున్నారు. 

ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రెండు రోజుల వేడుకల్లో భాగంగా 500 మంది నిరుపేద మహిళలకు చీరలు, అమృత ఆశ్రయ పథకం కింద సహాయం అందించడంతో పాటు 25 మంది అవసరార్థులకు వీల్చైర్లను పంపిణీ చేయనున్నారు. అలాగే అమ్మ సందేశాలను ప్రజలకు చేరువ చేసేందుకు ’అమ్మ గంగా’ తెలుగు రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అమ్మ ప్రవచనాల సంకలనమైన ’అమృత సూక్తి’ తెలుగు పుస్తకాన్ని ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.

వేదిక కార్యక్రమాల అనంతరం అమ్మవారి సత్సంగం, దాని తెలుగు అనువాదం, భక్తులకు వ్యక్తిగత దర్శనం కల్పించనున్నారు. ఈ వేడుకలకు ప్రతిరోజూ సుమారు 15 వేల మంది భక్తులు, మొత్తంగా 30 నుంచి 50 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అమ్మవారితో పాటు సుమారు వెయ్యి మంది 20 బస్సుల్లో ప్రయాణిస్తుండగా, వారిలో 300 మంది విదేశీ భక్తులు ఉన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారితో కలిసి భారత యాత్రలో పాల్గొంటూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. ఈ పవిత్ర వేడుకలకు భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దివ్య దర్శనం, ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు..

మరిన్ని వార్తలు