టిమ్స్ నిర్మాణ పనులు ముమ్మరం చేయాలి

11-11-2026 | 05:10am
  1. ఆసుపత్రికి ఎలాంటి నిధుల కొరత లేదు
  2. కొత్త ఏడాదిలో సూపర్ స్పెషాలిటీ సేవలు
  3. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 

సికింద్రాబాద్, నవంబర్10 (విజయక్రాం తి): అల్వాల్ నిర్మాణంలో ఉన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)(Telangana Institute of Medical Sciences) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Health Minister Damodara Raja Narasimha) అధికారులను ఆదేశించారు.

మంగళవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌తో ఆయన అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణ పనులకు సంబంధించిన పనులను సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ 2023లో ప్రారంభ మైన ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు అప్పటికి కేవలం 14 శాతం మాత్రమే పూర్తయ్యా యని, ప్రస్తుతం 91 శాతం పనులు పూర్తయ్యాయని, ఆసుపత్రికి ఎలాంటి నిధుల కొరత లేదని మంత్రి తెలిపారు.

మిగిలిన పనులను డిసెంబరు 31లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి, వాటిని మరింత వేగంగా ఎలా పూర్తి చేయాలో రెండు గంటలపాటు సమీక్షించారు. మొత్తం 36 విభాగాలతో 12 బ్రాడ్ స్పెషాలిటీ, 14 సూపర్ స్పెషాలిటీ, 7 సపోర్టింగ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని, ఒక్కో టిమ్స్ 100 పడకలను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించాలని లక్ష్యంగా పెట్టు కున్నట్లు పేర్కొన్నారు.

కొత్త ఏడాదిలో అల్వా ల్ టిమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, మరో రెండు నెలల్లో ఓపీ సేవలు ప్రారంభించామని, ఆ తర్వాత దశలవారీగా ఇన్పషెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ అధికారు లు, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రీస్తునాథ జనచంకు, డీఎంఈ,అదనపు డీఎంఈ,కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు