కేవీఆర్ బీ-27 షాపు సెపరేట్!?

11-11-2026 | 05:20am
  1. బోయినపల్లి మార్కెట్‌లో ఇష్టారాజ్యంగా వాహనాల నిలుపుదల
  2. కొందరికే వత్తాసు పలుకుతున్న అధికారగణం
  3. మార్కెట్‌లో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్న పార్కింగ్
  4. పట్టించుకోని మార్కెటింగ్ శాఖ అధికారులు?

సికింద్రాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): బోయిన్పల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూరగాయల మార్కెట్లో(Dr. B.R. Ambedkar Vegetable Market) నిబంధనల అమలుపై పలువురు వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ(Marketing Department) నిబంధనల ప్రకారం ఒక లైసెన్స్దారుడు తన షాపు వద్ద పరిమిత సంఖ్యలోనే వాహనాలను నిలిపేందుకు అనుమతి ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

అయితే, కె.వి. ఆర్. బి-27, శ్రీ శ్రీనివాస వెజిటబుల్ కమిషన్ ఏజెంట్ షాపు వద్ద మాత్రం నిబం ధనలకు విరుద్ధంగా వాహనాలను నిలుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ఇప్పటికే కూరగాయ లు, ఇతర సరుకులతో వచ్చే భా రీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో రహదారులు ఇరుకుగా మారుతున్నాయి.

దీనికి తోడు ఒకే షాపు వద్ద అధిక సంఖ్యలో వాహనాలు నిలిపితే మార్కెట్లో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోందని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్లోకి అడుగు పెట్టాలంటేనే ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటామనే భయంతో రిటైల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మార్కెటింగ్ శాఖ నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాల్సి ఉండగా, కొందరి విషయంలో మాత్రం ఎందుకు అమలు కావడం లేదని వ్యాపారు లు ప్రశ్నిస్తున్నారు.

ఒక లైసెన్స్దారుడికి ఎన్ని వాహనాలు నిలిపేందుకు అనుమతి ఉం ది? అనుమతికి మించి వాహనా లు నిలిపితే చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉంది? నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఫిర్యాదులపై అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. మార్కె ట్ యార్డులో ట్రాఫిక్ క్రమ బద్ధీ కరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రతి షాపు వద్ద వాహనాల నిలుపుదలకు స్పష్టమైన పరిమితులు విధించి వాటిని అందరికీ సమానంగా అమలు చేయాలని వ్యాపారులు కోరుతున్నారు.

సంబంధిత షాపు వద్ద ఉన్న వాహ నాల సంఖ్య, వాటి పార్కింగ్కు ఉన్న అనుమతులు, మార్కెటింగ్ శాఖ జారీ చేసిన ఆదేశా లను అధికారులు పరిశీలించాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు స్పం దించి వాహనాల పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారా? లేక ఫిర్యాదులు వచ్చినా చూసీచూడనట్లు వ్యవహ రిస్తారా? అనేది వేచి చూడాల్సిందే..

ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు..

తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద మార్కెట్ల చట్టం 1966లోని సెక్షన్ 7 ప్రకారం వ్యాపారులు లైసెన్స్ నిబంధనలు, మార్కెట్ కమిటీ రూపొందించిన ఉప నిబంధనలు పాటించాలి. లైసెన్స్లో పేర్కొన్న షరతులను ఉల్లంఘిస్తే మార్కెట్ కమిటీకి లైసె న్స్‌పై చర్యలు తీసుకునే అధికారం ఉంటుం ది. ఉల్లంఘనలపై విచారణ జరిపి నిబంధనల ప్రకారం లైసెన్స్ను సస్పెండ్ లేదా రద్దు చేసే అవకాశం ఉంది. 

మార్కెటింగ్ శాఖ అధికారులు నిబంధనలు బయటపెట్టాలి.. 

కె.వి.ఆర్.బి-27 షాపు వద్ద వాహనాల పా ర్కింగ్కు మార్కెట్ కమిటీ ప్రత్యేక అనుమతి ఇచ్చిందా? ఇస్తే ఎన్ని వాహనాలకు ఇచ్చిం ది? ఇతర వ్యాపారులకు కూడా అదే వెసులుబాటు ఉందా? లేక అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమా? మార్కెట్ కమిటీ రికార్డులు బయటపెటాలని వ్యాపారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు