సీఎం కాన్వాయ్‌ ముందుకొచ్చిన ఎద్దు

22-11-2026 | 05:47pm

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు పాతబస్తీలో తృటిలో ప్రమాదం తప్పింది. చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద కాన్వాయ్‌కు ఎదురుగా అకస్మాత్తుగా ఓ ఎద్దు రావడంతో అప్రమత్తమైన మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. ఎద్దును పక్కకు లాగి వాహనాలకు మార్గం సుగమం చేశారు.

ఈ క్రమంలో కాన్వాయ్ వాహనాలకు బ్రేకులు వేసి నెమ్మదిగా ముందుకు కదిలారు. గాంధీభవన్ నుంచి రేస్‌కోర్స్‌లో నిర్వహించే సీఎం ట్రోఫీ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.

మరిన్ని వార్తలు