చిన్నారికి పోలియో చుక్కలు వేసిన అలీ బాక్రీ

22-11-2026 | 01:15pm

హైదరాబాద్: ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో మహమ్మారి (Polio Disease) నుంచి రక్షించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ సీనియర్ నాయకుడు, తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర ప్రతినిధి మీర్ ఫరాసత్ అలీ బాక్రీ పిలుపునిచ్చారు. 2026 రాష్ట్రస్థాయి పల్స్ పోలియో (Pulse Polio) జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ఆదివారం పాతబస్తీలోని చార్మినార్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారికి స్వయంగా పోలియో చుక్కలు వేశారు.

ఈ నెల 22న నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ టీకాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే నవంబర్ 23, 24 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు.ఈ సందర్భంగా ఫరాసత్ అలీ బాక్రీ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. రెండు చుక్కలు చిన్నారుల జీవితాలకు రక్షణ (Protection) కల్పిస్తాయని అన్నారు.

కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది పావని, నిషా, ఎం.కృష్ణతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తించి టీకాలు అందించేలా ఆరోగ్య కార్యకర్తలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా కొనసాగించేందుకు ప్రజలందరూ సహకరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. చిన్నారుల ఆరోగ్య భద్రత (Child Health) ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు