భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్
వరంగల్, నవంబర్ 22 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని (Temple) ఆదివారం త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్ (Governor)కు ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, కమటం వేణుగోపాల్, మయూరి రామేశ్వరరావు, వల్లూరి పవన్ కుమార్, కారెంగుల సురేష్ బాబు, మాడిశెట్టి నతీష్, రమేష్ చంద్ భంగ్, పేరాల శ్రీనివాసరావు, ప్రధానార్చకులు భద్రకాళి శేషులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గవర్నర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు (Special Prayers) నిర్వహింపజేశారు. పూజల అనంతరం ఆలయ మహామండపంలో అర్చకులు, వేదపండితులు మహదాశీర్వచనం (Vedic Blessings) అందజేశారు. అమ్మవారి శేషవస్త్రాలను బహూకరించి, తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.