గాంధీ భవన్‌లో మహేష్ గౌడ్ ఆంక్షలు.. అజెండా దాటితే నో!

22-11-2026 | 05:29pm

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో(Telangana Congress) కీలక సమావేశాలు జరుగుతున్న వేళ.. గాంధీ భవన్(Gandhi Bhavan) వేదికగా జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) భేటీ ఆసక్తికరంగా సాగింది. సమావేశంలో ఏ అంశాలు చర్చించాలి. ఏ అంశాలకు దూరంగా ఉండాలి. అన్న దానిపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ముందుగానే స్పష్టత ఇచ్చారు. అజెండాలో ఉన్న అంశాలు తప్ప ఇతర విషయాలను ప్రస్తావించవద్దంటూ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సమావేశం నిర్ణీత అజెండా చుట్టూనే కొనసాగింది. 

వాతావరణ పరిస్థితులు(Weather conditions) రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి. ఎల్‌నినో పరిస్థితుల(El Nino conditions) నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. 

ఈ సమావేశంలో మరో కీలక ప్రకటన చేశారు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud). రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో పనులు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా చెరువుల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు, చెరువుల మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు