‘కేబీఆర్’కు స్టీల్ బ్రిడ్జి!

07-10-2026 | 05:05am
  1. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ముఫకంజా వరకు
  2. ఫ్లు ఓవర్లు, అండర్‌పాస్‌లు రద్దు.. వన్‌వే పర్మనెంట్    
  3. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ    

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : కేబీఆర్ పార్కు(KBR Park) చుట్టూ ప్లుఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు(State government abolished) చేసింది. వాటి స్థానంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ముఫకంజా కాలేజీ వరకు సరికొత్తగా స్టీల్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రాజెక్టును రీ డిజైన్(Redesigning the project) చేస్తూ అందుకు సంబంధించిన బాధ్యతలను మెఘా సంస్థకు అప్పగిస్తూ పట్టణాభివృద్ది శాఖ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్(Jayesh Ranjan) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్టీల్ బ్రిడ్జిని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1కు అనుసంధానించేలా ర్యాంప్ ఏర్పాటు చేయనున్నారు.

టెండర్ విధానంలో చె ల్లించిన డిపాజిట్లను తిరిగి చెల్లిస్తూ కేఎన్‌ఆర్ నిర్మాణ సంస్థకు జారీ చేసిన లెటర్ ఆఫ్ అవార్డును ఉపసంహరించుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో అనుమతి ఇచ్చిన రూ.1,090 కోట్ల నిధులను కుదించారు. ఫ్యాకేజీ-1లో మంజూరైన వ్యయాన్ని రూ. 580 కోట్ల నుంచి రూ. 365 కోట్లకు, ఫ్యాకేజీ-2లో రూ.510 కోట్ల నుంచి రూ.349 కోట్లకు తగ్గించారు. ఇక పార్కు చుట్టూ వన్‌వే విధానం శాశ్వతంగా కొనసాగనుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు.

ఆరు లేన్లతో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నామని, వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిం దనిపేర్కొన్నారు. ఈపీసీ విధానంలో ఆధునిక స్టీల్ స్ట్రక్చర్ సాంకేతికతతో ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. జూబ్లీ హిల్స్ చెక్‌పోస్టు నుంచి ముగ్దా జంక్షన్ వరకు ప్యాకేజీ-1, ముగ్దా జంక్షన్ నుంచి ముఫకంజా కళాశాల వరకు రెండో ఫ్యాకేజీ కింద పనులు చేపట్టానున్నారు. 

మరిన్ని వార్తలు