తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సీఎంకు లీగల్ నోటీసు

25-11-2026 | 01:39pm

చెన్నై: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం(Thirupparankundram karthika lamp controversy) మరోసారి రాజకీయ, న్యాయపరమైన చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌(CM Vijay)కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తన న్యాయవాది ద్వారా ఈ నోటీసులు పంపినట్లు సమాచారం.

నవంబర్ 20న తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపథూన్‌ (రాతి స్తంభం) వద్ద కార్తీక దీపం(Karthika Deepam) వెలిగించేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) ప్రత్యేకంగా అనుమతించింది. నవంబర్ 24న పరిమిత సంఖ్యలో అధికారిక బృందం దీపం వెలిగించాలని ఆదేశించింది. అయితే నిర్దేశిత స్థలంలో దీపం వెలిగించకపోవడంపై భాను ప్రకాశ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. దీపథూన్‌పై కార్తీక దీపం ఎందుకు వెలిగించలేదో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో తిరుప్పరంకుండ్రం దీపం వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వార్తలు