ఏడాదిలోపే ఇందిరమ్మ టవర్స్ పూర్తి
- వెంటనే లబ్ధిదారుల చేతికి తాళాలిస్తాం
- వేగంగా నిర్మించే కాంట్రాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
- 5,218 మంది అర్హుల నుంచి లక్కీ డ్రా
- 480 కుటుంబాలకు ఇళ్ల కేటాయింపు
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- మెరుగైన మౌలిక వసతులతో నివాసాలు
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- మేడ్చల్ జిల్లా గాజులరామారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన
కుత్బుల్లాపూర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): క్యూర్ పరిధిలో తొలివిడత ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న లక్ష ఇళ్ల ఇందిరమ్మ టవర్స్‌ను(Indiramma Towers Housing) పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసి ఏడాదిలోగా లబ్ధిదారులకు(Beneficiaries) అందించేం దుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసు కుంటోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) తెలిపారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో ఇందిరమ్మ ఇండ్ల టవ ర్స్‌కు మంగళవారం ఐటీ శాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu), ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకు స్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు 23 అసెంబ్లీ నియో జకవర్గాలలో ఇందిరమ్మ టవర్స్‌ను నిరంత ర ప్రక్రియగా నిర్మిస్తామని తెలిపారు. దీనిలో భాగంగా ఏడాది గడువును కాంట్రాక్టర్లకు నిర్దేశించామని చెప్పారు. అయితే ఒక నెల ముందుగా పూర్తి చేస్తే రూ.45 లక్ష, రెండు నెలల ముందుగా పూర్తి చేస్తే రూ.90 లక్షలు ప్రోత్సాహక బహుమతిగా ఇస్తామని వివరిం చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇళ్ల కోసం 7 వేల మందికి పైగా దరఖాస్తులు అందగా, పరిశీలన అనంతరం 5,218 మం ది అర్హులుగా తేలారని వెల్లడించారు.
వారి లో లబ్ధిదారుల ఎంపికను బహిరంగంగా లక్కీ డ్రా ద్వారా చేపట్టి, 480 మందిని తుది జాబితాలో ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎంపిక ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించామని, ఎవరికి ఏ విధంగా ఇల్లు మంజూరైందనే వివరాలను కూడా లబ్ధిదారులకు తెలియజేయడంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అందజే స్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కేటాయిం చిన ఇళ్లతో కార్యక్రమం ముగియదని, మరో మూడు విడతల్లోనూ ఇళ్ల నిర్మాణాన్ని చేపడ తామని తెలిపారు.
ప్రస్తుతం సుమారు 7.5 ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నదని, దీనితో పాటు నియోజకవర్గంలో ఉన్న ఇతర ప్రభుత్వ, హౌసింగ్ శాఖ భూములను గుర్తిం చి అక్కడ కూడా పేదలకు ఇళ్లు నిర్మించే చర్య లు చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులకు ఇప్పటికే సూచనలు చేసినట్లు వెల్లడించారు. ఇళ్ల ని ర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించాలని సూచించారు
‘మీ కళ్ల ముం దే మీ ఇల్లు నిర్మించబడాలి.. నాణ్యతతో కూడిన ఇంటిని సొంతం చేసుకు న్నామనే తృప్తి కలగాలి అనేదే ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశం’ అని పేర్కొన్నారు. పేదల చిన్న చిన్న కోరికలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, సీఎం రేవంత్‌రెడ్డి నాయ కత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.
మెరుగైన వసతులతో నివాసాలు: మంత్రి శ్రీధర్‌బాబు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడు తూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతు లతో కూడిన గృహాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇళ్ల నిర్మా ణంతో పాటు అవసరమైన మౌలిక సదు పాయాలపైన దృష్టి సారిస్తున్నామని పే ర్కొన్నారు. నిర్మాణ పనులు వేగంగా సాగ డంతో పాటు నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకో వాలని సూచించారు. పేదవాడి సొంతింటి కలను కేవలం హామీగా కాకుండా, కార్య రూపంలోకి తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కొలన్ హన్మంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూ న శ్రీశైలంగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, హౌసింగ్ శాఖ సెక్ర టరీ విపి గౌతమ్, కలెక్టర్ మనూ చౌదరి పాల్గొన్నారు.