సర్పంచ్ మృతిపై హరీష్ రావు సంతాపం

05-11-2026 | 10:07am

నంగునూరు,(విజయక్రాంతి): నంగునూరు మండలం అప్పలాయ్ చెరువు గ్రామ సర్పంచ్(Cheruvu village Sarpanch) పెద్దమ్మల సత్యం ముదిరాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సత్యం అకాల మృతి పార్టీకి,గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు.నిత్యం గ్రామ అభివృద్ధి కోసం పరితపిస్తూ, ప్రజా సేవనే లక్ష్యంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఈ క్ష్ట సమయంలో సత్యం కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇస్తూ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు