సైక్లింగ్‌లో జాతీయ స్థాయికి రమ్య
- ఆస్మితా ఖేలో ఇండియా ట్రయల్స్‌లో స్వర్ణం
- ఫలించిన కేటీఆర్ సాయం
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు జాతీయ స్థాయి(National-level athletes)లో సత్తా చాటగల రనడానికి నల్గొండకు చెందిన యువ సైక్లిస్ట్ రమ్య(Young cyclist Ramya) విజయం నిదర్శనంగా నిలిచింది. రమ్య సైక్లింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఆస్మితా ఖేలో ఇండియా పోటీల్లో(Asmita Khelo India Competition) స్వర్ణ పతకం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. నల్లగొండ మండలం కన్సన్పల్లికి చెందిన రమ్య ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) సైక్లింగ్ శిక్షణ కేంద్రంలో పొందుతోంది.
శిక్షణలో భాగంగా గతంలో జింఖాన గ్రౌండ్‌కు వెళ్లిన సమయంలో అక్కడ ఒక కార్యక్రమానికి హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసింది. సైక్లింగ్‌లో తన ఆసక్తి, శిక్షణ గురించి రమ్య వివరించగా.. ఆమె ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో కేటీఆర్ సైకిల్‌ను అందించారు. కేటీఆర్ అందించిన సైకిల్‌తోనే రమ్య తన శిక్షణను కొనసాగించింది. తాజాగా ఆస్మితా ఖేలో ఇండియా పోటీల్లో సైక్లింగ్ ట్రయల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది.
తెలంగాణ స్థాయిలోనూ గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. రమ్య సాధించిన విజయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా అభినందించారు. రమ్య విజయం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తాను అందించిన సైకిల్, అందించిన ప్రోత్సాహం రమ్యను జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.