తిరుమలలో భక్తుల రద్దీ
ఏడుకొండలవాడి దర్శనం కోసం 15 గంటల Wait!
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం(Tirumala Tirupati Devasthanams) కోసం తిరుమల కొండపైకి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మొత్తం 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్లు వెలుపల శిలాతోరణం వరకు విస్తరించడంతో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. మరోవైపు నిన్న ఒక్కరోజే 70,124 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 32,298 మంది తలనీలాలు సమర్పించారు.
హుండీ ద్వారా రూ.4.92 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, పెద్ద శేష వాహనంపై సప్తశిరోభూషితుడైన శ్రీ ఆదిశేషుని రూపంలో కొలువుదీరిన శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆధ్యాత్మిక శోభతో తిరుమల కొండ మారుమోగింది.