హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్

14-11-2026 | 08:36am

సైబర్ టవర్స్ నుంచి హైటెక్స్ వరకు నో ఎంట్రీ!

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్న Gig Workers Bike Rally నేపథ్యంలో నవంబర్ 14న మాదాపూర్ పరిసరాల్లో Traffic Restrictions అమలు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు బైక్ ర్యాలీ జరగనుండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

సైబర్ టవర్స్ నుంచి హైటెక్స్ క‌మాన్ (మెటల్ చార్మినార్), అక్కడి నుంచి HICC, నోవాటెల్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలపై పరిమితులు ఉంటాయి. ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచించారు. సైబర్ టవర్స్ నుంచి కొత్తగూడ, కొండాపూర్ వెళ్లేవారు యశోద వసంత సిటీ రోడ్, నోవాటెల్, RTA జంక్షన్ మీదుగా వెళ్లాలి. బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లేవారు IKEA రోటరీ, మీనాక్షి, రోలింగ్ హిల్స్, రాడిసన్ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్ మార్గాన్ని ఎంచుకోవాలి.

కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వెళ్లేవారు రాడిసన్, AIG, IKEA రోటరీ మీదుగా వెళ్లాలని సూచించారు. టెక్ మహీంద్రా నుంచి మెటల్ చార్మినార్ వైపు వెళ్లే వాహనాలను CII జంక్షన్ వద్ద బొటానికల్ గార్డెన్ దిశగా మళ్లించనున్నారు. ప్రభావిత మార్గాల్లో Heavy Vehicles రాకపోకలను పూర్తిగా నిషేధించడంతో పాటు మాదాపూర్ Traffic Police Station పరిధిలో వాహనాల కదలికలను నియంత్రించనున్నారు. ప్రయాణికులు ముందుగానే తమ Journey Plan చేసుకుని, ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

ప్రత్యామ్నాయ మార్గాలు

ప్రయాణ దిశ సూచించిన మార్గం

సైబర్ టవర్స్ → కొండాపూర్ యశోద వసంత సిటీ రోడ్ – నోవాటెల్ – RTA జంక్షన్

సైబర్ టవర్స్ → బొటానికల్ గార్డెన్ IKEA రోటరీ – మీనాక్షి – రోలింగ్ హిల్స్ – రాడిసన్ – గచ్చిబౌలి ఫ్లైఓవర్

కొత్తగూడ → సైబర్ టవర్స్ రాడిసన్ – AIG – IKEA రోటరీ

టెక్ మహీంద్రా → మెటల్ చార్మినార్ CII జంక్షన్ నుంచి బొటానికల్ గార్డెన్ వైపు మళ్లింపు

మరిన్ని వార్తలు