దక్షిణాదిలో సైబర్ బ్యూరో భారీ ఆపరేషన్

07-10-2026 | 05:10am

100 మందికి పైగా ఏజెంట్లు అరెస్ట్!

సైబర్ నేరగాళ్లకు నకిలీ ఖాతాలు, కేవైసీ పత్రాలు సమకూరుస్తున్నట్టు నిర్ధారణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(Telangana Cyber ​​Security Bureau) (టీసీఎస్ బి) దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో కీలక పురోగతి సాధించింది. సైబర్ నేరగాళ్లకు మ్యూల్(A mule for cybercriminals) (నకిలీ) ఖాతాలు, కేవైసీ పత్రాలు(KYC documents) సమకూరుస్తున్న 100 మందికి పైగా ఏజెంట్లను పోలీసులు అరెస్టు(Police arrest) చేశారు. గత రెండు వారాలుగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసి నిందితుల నుంచి డెబిట్ కార్డులు, పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను మోసం చేసిన కేసులో రూ.11 కోట్లు పలు మ్యూల్ ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ ఖాతాలను సరఫరా చేసిన ఏజెంట్లను ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నిందితులకు దుబాయ్ సహా ఇతర దేశాల సైబర్ నేరగాళ్లతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అంతర్జాతీయ లింకుల పైన కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

మరిన్ని వార్తలు