‘దోస్త్’అడ్మిషన్ల జోరు!
గతేడాదితో పోలిస్తే 8,531 అధికం
కొత్త కోర్సులు, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలతో పెరిగిన ప్రవేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం(Academic Year) డిగ్రీ అడ్మిషన్లు(Degree Admissions) భారీగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 937 డిగ్రీ కళాశాలలు ఉండగా.. గతేడాది ‘దోస్త్’ద్వారా 2,05,140 మంది విద్యార్థులు చేరారు. ఈ ఏడాది 2,13,671 అడ్మిషన్లు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే 8,531 అడ్మిషన్లు పెరిగినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి(Telangana State Council of Higher Education) (టీజీసీహెచ్‌ఈ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
నూతన కోర్సులను ప్రవేశపెట్టడం, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్-, పోస్ట్ గ్రాడ్యుయేట్ కో ర్సులను అందుబాటులోకి తేవడంతో అడ్మిషన్లు పెరిగినట్టు తెలంగాణ ఉన్నత విద్యా మం డలి (టీజీసీహెచ్‌ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి(Balakrishna Reddy) తెలిపారు. ఈ విద్యా సంవత్సరం మూడు దఫాలు రెగ్యులర్ కౌన్సెలింగ్ రౌండ్ల తో పాటు రెండు ప్రత్యేక కౌన్సెలింగ్ రౌండ్లు, స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టడం కూడా ప్ర వేశాల పెరుగుదలకు దోహదపడిందన్నారు.
అధ్యాపక పోస్టుల భర్తీకి కసరత్తు
యూనివర్సిటీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి జీవో నెం.21లో మార్పులు చేయనున్న ట్లు తెలిసింది. ఈ పోస్టులకు దరఖాస్తులను ఉ న్నత విద్యామండలి స్వీకరించి 1:12 చొప్పున ఫిల్టర్ చేసి ఆయా వర్సిటీలకు వాటిని పంపించనున్నారు. తర్వాత యూజీసీ నిబంధనల మేరకు వర్సిటీలు నియామక ప్రక్రియ చేపట్టనున్నాయి.