చిన్నపిల్లల ట్రీట్మెంట్ కు సహాయం
ముప్పనపల్లి సహాయ నిధి
ఆధ్వర్యంలో చిన్నపిల్లల ట్రీట్మెంట్ కు సహాయం
1లక్ష నలభై మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు రూపాయలు (143421)ఆర్ధిక సహాయం
దాతల సహాయం మరువలేనిది ముప్పనపల్లి సహాయ నిధి అధ్యక్షులు : అబ్బు సతీష్
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన కుమ్మరి రమేష్ ఇద్దరు పిల్లలు కూతురు, కొడుకు మూడు రోజుల క్రితం ఆడుకుంటూ చెత్త కుప్ప మంటలో పడి తన ఇద్దరు పిల్లలు 60% శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం హన్మకొండ(Hanumakonda)లోని వేద హాస్పిటల్ చికిత్స అందిస్తున్నారు. వైద్య ఖర్చుల కోసం సుమారుగా 3లక్షల రూపాయలు ఖర్చులు అవుతాయని వైద్యులు తెలిపారు.
రమేష్ కుటుంబం చాలా నిరుపేద కుటుంబము కావడంతో ముప్పనపల్లి సహాయ నిధి దాతలు సహాయం చేసి మా పిల్లలను కాపాడగలరని తండ్రి రమేష్ వేడుకోగా సహాయ నిధి ధాతల సహాయంతో మంగళవారం రోజున హన్మకొండలోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిల్లలను పరామర్శించి 1లక్ష నలభై మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క (143421 )రూపాయలు తండ్రి రమేష్ కు అందించారు. ఈ కార్యక్రమంలో సహాయ నిధి సభ్యులు వనం ప్రకాష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి రాంబాబు, దుర్గం ప్రభాకర్, కంచ రమేష్, తిప్పనపల్లి విజయ్, బోనాముక్కుల కాటన్ రెడ్డి,యం. డి.ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.