సీఎంకు షాక్.. విజయశాంతి సంచలన కామెంట్స్

06-11-2026 | 12:41pm

హైదరాబాద్: తెలంగాణలో పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్య ప్రజల Household Budgetపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి(Congress MLC Vijayashanti) ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం పండించే రాష్ట్రంలోనే ప్రజలు బియ్యం కొనలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెరుగుతున్న Rice Pricesను Control చేయడంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రూ.1,500కు లభించిన 25 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు ఏకంగా రూ.2,500కు చేరిందని విజయశాంతి పేర్కొన్నారు. అంటే ఒక్క బస్తాపైనే వినియోగదారులకు రూ.1,000 అదనపు భారం పడుతోందని అన్నారు. మరోవైపు కిలో సన్నబియ్యం ధర రూ.85 నుంచి రూ.100కు చేరడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

రోజువారీ అవసరాల్లో అత్యంత కీలకమైన బియ్యం ధరలు ఇలా పెరిగితే Middle Class, Poor Familiesపై ఆర్థిక భారం మరింత పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు Rice Price Hike మరో భారంగా మారిందని అన్నారు. సామాన్యులపై ఈ స్థాయిలో ధరల భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బియ్యం ధరలను నియంత్రించడంలో Revanth Reddy Government ఎందుకు విఫలమవుతోందని విజయశాంతి నిలదీశారు. ధాన్యం పండించే తెలంగాణలోనే ప్రజలు అధిక ధరలకు బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే Market పరిస్థితులను సమీక్షించి, ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు