భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తున్నారా?.. ఈ రూట్లలో నో ఎంట్రీ!
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, వాహనాల రద్దీని నియంత్రించేందుకు నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలు చేయనున్నారు.
మదీనా నుంచి చార్మినార్, ముర్గీ చౌక్ నుంచి చార్మినార్, షాలిబండ నుంచి చార్మినార్ వెళ్లే మార్గాల్లో ఆంక్షలు (Traffic Regulations) విధించనున్నారు. ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలను (Vehicle Movement) అవసరాన్ని బట్టి నియంత్రించనున్నారు.
దీపావళి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను (Alternative Routes) వినియోగించుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.