లోన్ ఇప్పిస్తామని మహిళా డాక్టరుకు వేధింపులు
ఆరుగురు అరెస్టు, పరారీలో నలుగురు
ఎల్బీనగర్, నవంబర్ 5: అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను పీడిస్తున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు(LB Nagar Police), ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం(SOT team) అరెస్టు చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి గురువారం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో వెల్లడించారు. మణికొండకు చెందిన డాక్టర్ లక్ష్మీనాద్గిర్ ఎల్బీనగర్‌లోని చింతలకుంటలో ఉన్న రెయిన్ బో హస్పిటల్‌లో విజిటింగ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్‌గా పనిచేస్తుంది. ఆమె రూ.30 లక్షల విలువైన డ్రైవెన్ క్యాన్సర్స్ డిటెక్షన్ మెషీన్‌ను కొనుగోలు చేయాలనుకున్నారు.
ఈ మేరకు ఆగస్టు మొదటి వారంలో ఫిల్మ్ నగర్‌లోని ఒక సెలూన్‌లో షీలా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వైద్య పరికరాల కొనుగోలుకు ఫైనాన్స్ ఇచ్చే వ్యక్తులు తనకు తెలుసని నమ్మబలికింది. ఈ క్రమంలో షీలా బాధితురాలిని మన్సూరాబాద్‌లోని తన నివాసానికి తీసుకెళ్లి రాణి, వరుణ్, జ్యోతి, లక్ష్మి అలియాస్ లత, విజయను పరిచయం చేసింది. రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, బాధితురాలి వద్ద నుంచి విడతలవారీగా నగదు వసూలు చేశారు. వరుణ్ అనే వ్యక్తి డాక్టర్‌ని సంప్రదించి, మొదట రూ.2,40 లక్షలు ఇచ్చి రూ.3 లక్షలు ప్రామిసరీ నోటును తీసుకున్నాడు.
లక్ష్మిఅనే మహిళ లోన్ ఇస్తానని చెప్పడంతో బాధితురాలు రూ.10 లక్షలు చెల్లించింది. స్వప్న డాక్టర్ వద్ద ఉన్న కారును ఆధీనంలోకి తీసుకుంది. అక్టోబర్ 9న వరుణ్.. బాధితురాలు కారును బలవంతంగా లాక్కున్నాడు. దీంతో బాధితురాలని పదేపదే బెదిరించడం, వేధించడంతో అక్టోబర్ 24న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొత్తం రూ.15.50 లక్షలు అక్రమంగా వసూలు చేశారని, రూ.24, 50 లక్షలు ప్రామిసరీ నోట్ల రాపించుకున్నారని, 6 ఖాళీ చెక్కులు తీసకున్నారని, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎల్బీనగర్ పోలీసులు షీలా, రాణి, వరుణ్, జ్యోతి, లక్ష్మి, విజయ, స్వప్నలను అరెస్టు చేశారు. ముగ్గురు పరారిలో ఉన్నారు.