మల్లెలమడుగు రూపురేఖల మార్పు.. అభివృద్ధి పనులు ప్రారంభం
అశ్వాపురం, నవంబర్ 6 (విజయక్రాంతి): గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్లెలమడుగు గ్రామ పంచాయతీలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు (CC Roads), కల్వర్టు (Culvert), సైడ్ డ్రైన్ (Side Drain) పనులను పినపాక ఎమ్మెల్యే, శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రహదారులు (Rural Roads), డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.