కానిస్టేబుల్ కుటుంబానికి కోటి భరోసా

06-11-2026 | 01:47pm

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): పిడుగుపాటుతో మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ రాజు కుటుంబానికి పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ (Police Salary Package Insurance) కింద మంజూరైన రూ.కోటి బీమా (Insurance Claim) చెక్కును జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ శుక్రవారం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి (Deceased Constable's Family) పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి పోలీసు సిబ్బంది బీమా సదుపాయాలను (Insurance Benefits) తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు