తగ్గిన రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం

24-11-2026 | 08:27am

తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల కొండపై భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు. మరోవైపు సోమవారం (నవంబర్ 23) శ్రీవారిని మొత్తం 75,640 మంది భక్తులు దర్శించుకున్నారు. మొక్కుల్లో భాగంగా 23,439 మంది తలనీలాలు సమర్పించారు.

భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ.4.13 కోట్ల ఆదాయం సమకూరింది. రద్దీ తగ్గడంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు కొంత ఊరట లభిస్తోంది. అయితే దర్శన సమయాలు, క్యూ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉండటంతో భక్తులు టీటీడీ తాజా ప్రకటనలను గమనించాలని సూచన.

మరిన్ని వార్తలు