చేనేత రంగానికి న్యాయం చేయాలి

24-11-2026 | 05:25am

రౌండ్ టేబుల్ మీటింగ్‌లో ప్రభుత్వాలకు వినతి

ముషీరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(Central and State Governments) చేనేత రంగాన్ని(Handloom Sector)  ఆదుకోవాలని చేనేతల చైతన్య వేదిక డిమాండ్ చేసింది. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో(Sundarayya Vignana Kendram, Baghlingampally) సోమవారం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు చేనేత కళాకారులపై వివక్ష అనే అంశంపై వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్కా దేవదాసు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీసీ మేధావుల ఫోరం చైర్మన్,  రిటైర్డ్ ఐఏఎస్  టి. చిరంజీవులు(Chiranjeevulu) మాట్లాడుతూ చేనేత రంగానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ నిధులు కేటాయిస్తున్నాయని, ఇచ్చిన వాటిని కూడా సైతం పూర్తిగా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. చేనేతలకు కనీస వేతనాలు, నూలు సబ్సిడీ, 25 శాతం వస్త్రాల సబ్సిడీ కల్పించాలని కోరారు. చేనేతల సమస్యల పరిష్కారానికి  పార్టీలతో జేఏసీ ఏర్పాటు చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

మరిన్ని వార్తలు