నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక పరీక్ష ఫీజులన్నీ మాఫీ

24-11-2026 | 06:56am

ఇక ఉద్యోగ పరీక్షలు ఫ్రీ

కోల్‌కతా: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత(Unemployed youth)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం(West Bengal government) తీపికబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు దరఖాస్తు ఫీజును రద్దు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అభ్యర్థుల తరఫున పరీక్షల ఫీజు ఖర్చును ప్రభుత్వమే భరించనుంది.

ముఖ్యమంత్రి సువేందు అధికారి(Chief Minister Suvendu Adhikari) ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నిరుద్యోగ యువతపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. తాజాగా కేబినెట్ కూడా ఫీజుల మాఫీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలో సుమారు 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పోలీసు శాఖలో కానిస్టేబుళ్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో పాటు ఇతర విభాగాల్లోనూ నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వరుసగా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ నిర్ణయం ఆర్థికంగా ఊరటనివ్వనుంది.

మరిన్ని వార్తలు