చలో హైదరాబాద్ బహిరంగ సభ
- తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది
- లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించుటకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి
వెంకటాపురం, నూగూరు, నవంబర్ 26, విజయ క్రాంతి: వెంకటాపురం మండల కేంద్రంలో కొమరం భీం సెంటర్ నందు తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం(Telangana Adivasi Sangham) గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం పోడియం సురేష్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచంద్రరావు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆదివాసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు తీవ్ర అన్యాయం జరిగిందని లంబాడాలను ఎస్టి జాబితాలో చేర్చి 50 సంవత్సరాలు జరిగినప్పటికీ 50 సంవత్సరాలుగా ఆదివాసి హక్కులను హరించి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లను దోచుకున్నారని ఆయన అన్నారు.
ఆదివాసులు పూర్తిగా నష్టపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నారని ఆదివాసులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలి అంటే ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా వలస వచ్చిన లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించుటకు డిసెంబర్ 9న చలో హైదరాబాద్ బహిరంగ సభను తుడుం దెబ్బ మై పతి అరుణ్ అన్న నాయకత్వంలో నిర్వహిస్తున్న సభకు తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆయన తెలియజేశారు.డిసెంబర్ 9 హైదరాబాద్ బహిరంగ సభను జయప్రదం చేయుటకు గ్రామ గ్రామాన ఆదివాసి ప్రజానీకం మహిళలు యువకులు అందరూ భారీ ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పూనెం మునీశ్వరరావు ములుగు జిల్లా అధ్యక్షులు ఉండం రామచంద్ర ప్రసాద్ మండల అధ్యక్షులు సోలం సుధాకర్ కోరం ప్రసాద్ సోలం చంటిబాబు మడకం సంజయ్ కుమార్ తురుస రాజు పూనెం పవన్ కుమార్ శ్యామల మహేష్ కాక ప్రశాంత్ పొడెం సురేష్ తదితరులు పాల్గొన్నారు.