సామాజిక న్యాయం, సమానత్వమే రాజ్యాంగ లక్ష్యం

26-11-2026 | 05:35pm

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

బెజ్జంకి, నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day of India) పురస్కరించుకొని బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మానకొండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని స్మరించుకున్నారు.

ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని హరీష్ రావు అన్నారు. రాజ్యాంగ మౌలిక లక్ష్యం ప్రతి ఒక్కరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమేనని పేర్కొన్నారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు రాజ్యాంగం ప్రతిరూపమని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు