కేసముద్రం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ

26-09-2026 | 11:13pm

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్

సిబ్బంది విధులు, గ్రామాల సందర్శనలు, రాత్రి గస్తీపై ఆరా

కేసముద్రం (విజయక్రాంతి): ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మెరుగైన పోలీస్ సేవలు అందించాలని  మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్(Mahabubabad District SP Dr. Sabarish) పోలీసులను ఆదేశించారు. ఎస్పీ కేసముద్రం పోలీస్ స్టేషన్‌ను(Kesamudram Police Station) ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, సిబ్బంది విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు(Investigation of cases), ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలను(Police services) పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ పోలీస్ స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.

అనంతరం ఎస్‌ఐ క్రాంతి కిరణ్‌తో స్టేషన్ సిబ్బంది విధుల కేటాయింపు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బందితో నేరుగా మాట్లాడిన ఎస్పీ వారి రోజువారీ విధులు, గ్రామాల సందర్శనలు, బీట్ విధులు, VPO (Village Police Officer) విధుల నిర్వహణ, గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, రాత్రి గస్తీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ స్థానిక సమస్యలు, నేర ప్రవృత్తులు, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం సేకరించాలని సూచించారు.

VPOలు తమకు కేటాయించిన గ్రామాల్లో నిరంతరం అందుబాటులో ఉంటూ, గ్రామస్థులతో సమన్వయం పెంచుకోవాలని, గ్రామంలో జరిగే ముఖ్యమైన పరిణామాలు, నేరాలకు సంబంధించిన సమాచారం మరియు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ఎస్పీ ఆదేశించారు. డయల్ 112కు వచ్చే అత్యవసర కాల్స్‌పై సిబ్బంది తక్షణమే స్పందించి, బాధితులకు వేగంగా పోలీస్ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు