వినియోగంలోకి తాళ్లపూసపల్లి సబ్ స్టేషన్
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో గత కొన్నేళ్ల క్రితం నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్(Electrical Substation) చాలాకాలంగా వినియోగానికి దూరంగా ఉంది. విద్యుత్ వినియోగం ఇటీవల విపరీతంగా పెరిగిపోవడంతో తాళ్లపూసపల్లి విద్యుత్ సబ్ స్టేషన్(Tallapoosapalli Electrical Substation) ను వినియోగంలోకి తేవడానికి అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం విద్యుత్ శాఖ ఎస్ ఈ దర్శన్ కుమార్ ఈ సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా కార్యక్రమాన్ని(Electricity supply program) ప్రారంభించారు.
సబ్ స్టేషన్ వినియోగంలోకి తేవడం వల్ల కల్వల సబ్స్టేషన్ పై లోడ్ తగ్గి ,తాళ్లపూసపల్లి, అన్నారం గ్రామాలకు చెందిన గృహ, వ్యవసాయ, ఇండస్ట్రీ వినియోగదారులకు హెచ్చుతగ్గులు లేని విద్యుత్ సరఫరా చేయడానికి అనుకూలంగా మారింది. అంతరాయాలు కూడా పూర్తిగా తగ్గి నిరంతర నాణ్యమైన సరఫరాను అందించుటకు వీలవుతుందని ఎస్ ఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డీ ఈ కోటేశ్వర్ రావు, Koteshwar rao, టెక్నికల్ డీ ఈ హీరాలాల్, ఏ డీ ఈ లు ఎం.రాములు నాయక్, ఎం.ఐలయ్య, బీ.లోకంత్ రెడ్డి, ఏ ఈ కే.రాజు, లైన్ ఇన్స్పెక్టర్ బీ.శ్రీను విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.