6 September, 2026 | 12:31 PM

ఉద్యమకారుడు పల్లె రవి మృతి

06-09-2026 | 11:15am

మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో సహాయశక్తులుగా కృషిచేసిన నగరంలోని క్రిస్టియన్ పల్లి ప్రాంతానికి చెందిన పల్లె రవి(Activist Palle Ravi passes away) మృతి చెందారు. రాత్రి క్రిస్టియన్ పల్లి సమీపంలో తన భార్యతో పాటు ద్విచక్ర వాహనంపై వెళుతున్న పల్లె రవిని  ఓ వాహనం ఢీకొట్టడంతో అతనికి వారి భార్యకు  తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఓ ఆసుపత్రికి వైద్య చికిత్సలు నిమిత్తం తరలించినప్పటికీ వైద్య చికిత్సలు పొందుతూ పల్లె రవి మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ జీవితమంతా స్వరాష్ట్ర ఉద్యమం తో పాటు బీఆర్ఎస్ పార్టీకి విధేయుడుగా పనిచేశారని వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు